హన్మకొండ చౌరస్తా: భద్రకాళి బండ్‌పై ఆవిష్కరించిన ‘రాకెట్ రుద్రమ’ స్ఫూర్తితో వరంగల్ నిట్ విద్యార్థి పింగిళి రాజశేఖర్‌రెడ్డి బృందం రూపొందించిన ‘రాకెట్ రుద్రమ’ మరో అరుదైన ఘనత సాధించినట్లు డీసీసీ అధ్యక్షుడు, కుడా మాజీ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఇస్రో నిర్వహిస్తున్న మోడల్ రాకెట్రీ ఇండియా స్టూడెంట్ కాంపిటీషన్ఙ్ పోటీల్లో ‘రాకెట్ రుద్రమ’ అత్యంత కీలకమైన క్రిటికల్ డిజైన్ రివ్యూ క్వాలిఫికేషన్ సాధించి, జాతీయ స్థాయి ఫైనల్స్‌కు అర్హత సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ రాకెట్ తుది తయారీ, ప్రయోగ ఖర్చుల కోసం వెంకట్రాంరెడ్డి చొరవతో డల్లాస్ కంపెనీ అధినేత శరత్‌రెడ్డి సౌజన్యంతో రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆర్థిక సాయం చెక్కును శనివారం జిల్లాకు విచ్చేసిన మంత్రి శ్రీధర్‌బాబు హనుమకొండలోని ఇనగాల నివాసంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి రాజశేఖర్ రెడ్డి బృందానికి అందజేశారు. విద్యార్థి బృందాన్ని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో ‘రాకెట్ రుద్రమ–2’ విజయం సాధించాలని ఆకాంక్షించారు.


