● వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
వరంగల్ స్పోర్ట్స్: విద్యార్థి దశ నుంచే పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇప్పించేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత కోరారు. వరంగల్‌లోని ఎల్బీ కళాశాల వేదికగా ఈనెల 16, 17వ తేదీల్లో నిర్వహించినున్న మినీ సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర చాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ బాధ్యులు బుధవారం సీపీ శ్వేతను కలిసి కోరారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బాలుర జట్లు పాల్గొంటాయని అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ పిల్లి సాంబశివరావు.. సీపీ శ్వేతకు వివరించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షులు పెరుమాండ్ల సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


