● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: పువ్వులను దేవతలుగా పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం టీఎన్జీవోస్, టీజీవోస్ సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా ఉద్యోగులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. అందంగా పేర్చిన బతుకమ్మలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. డీఆర్‌డీఏకు మొదటి, ఐసీడీఎస్‌కు రెండో, కలెక్టరేట్ రెవెన్యూ విభాగానికి మూడో బహుమతి లభించాయి. కాకతీయ వైద్య కళాశాలకు ప్రత్యేక బహుమతి అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ భర్త, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రవి, శేషాద్రి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మనన్ ఆకుల రాజేందర్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆకవరపు శ్రీనివాస కుమార్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్, పనికల రాజేష్, జగనన్ మోహన్‌రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, శ్యాంసుందర్, మాధవరెడ్డి, రామునాయక్, శ్రీనివాస్ రెడ్డి, జయంతి, శ్రీలత, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రీషియన్ ఆత్మహత్య
కాళేశ్వరం : ఉరేసుకుని ఓ ఎలక్ట్రీషియన్ ఆత్మహత్యకు పాల్పడ్డా డు. ఈ ఘటన బుధవారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటు చేసుకుంది. స్థానికుల కథ నం ప్రకారం.. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని బీజోన్‌కు చెందిన రంగు విజయ్(35) కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీపంపుహౌస్‌లో కాంట్రాక్టు పద్ధతిలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం చేస్తున్నాడు. కాళేశ్వరంలో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో తండ్రి కృష్ణమూర్తి పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అనుమానం వచ్చి కృష్ణమూర్తి హు టాహుటినా కాళేశ్వరం చేరుకుని ఇంటి తలుపులు కొట్టి చూడగా విజయ్ ఉరేసుకుని దూలానికి వేలా డుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సురేశ్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వె ళ్లింది. విజయ్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలా! లేదామరేదైన కారణామా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


