బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్ : జన గణన రెండో దశను సమర్థవంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి సంబంధిత నిబంధనలు, ప్రశ్నావళి, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. మంగళవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర పరిధి చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనగణన రెండో దశపై రెండు రోజుల శిక్షణలో భాగంగా మంగళవారం కలెక్టర్ హాజరై దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ సెన్సస్ విభాగం అధికారి సీహెచ్ సతీశ్, జూనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్ ప్రశాంత్ వెబ్ పోర్టల్ వినియోగం, బ్లాకుల మార్పులు, జనాభా వివరాల నమోదు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఓ సత్యనారాయణ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి పాల్గొన్నారు.


