ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యం

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

ఖిలా వరంగల్‌ : ప్రజల ప్రాణాలు రక్షించడమే ఆపదమిత్ర లక్ష్యమని టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్‌ కమాండెంట్‌ ఎన్‌వీఎస్‌ శ్రీనివాసరావు అన్నారు. విపత్తుల సమయంలో బాధితులను రక్షించి, సమాజానికి అండగా నిలిచేవారే నిజమైన ఆపద మిత్రులని పేర్కొన్నారు. ఆపద మిత్ర పథకంలో భాగంగా మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో 373 మంది ఎన్‌సీసీ కేడెట్లకు 7రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. ముఖ్యఅతిథిగా కమాండెంట్‌ ఎన్‌వీఎస్‌ శ్రీనివాసరావు హాజరై శిక్షణార్థులకు సర్టిఫికెట్లను అందజేసి మాట్లాడారు. శిక్షణలో ప్రథమ చికిత్స, సీపీఆర్‌, బేసిక్‌ లైఫ్‌, సపోర్‌, రక్తస్రావం నియంత్రించే పద్ధతులు, ఎముకలు, కండరాలకు గాయాలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. అగ్నిప్రమాదాల సమయంలో స్పందించే విధానాలు, భవనాల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే విధానంపై శిక్షణ ఇచ్చామని వివరించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ రవి, ఆర్‌ఎస్సై శ్రీను, ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.

టీజీఎస్పీ నాలుగో బెటాలియన్‌

కమాండెంట్‌ శ్రీనివాసరావు

ముగిసిన యువ ఆపదమిత్ర శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement