విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా ఎదగాలి

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

కాజీపేట రూరల్‌ : విద్యార్థులు తమ వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా ఎదగాలని బాలవికాస వ్యవస్థాపకురాలు బాల థెరిసా జింగ్రాస్‌ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌ బాలవికాస సెంటర్‌లో మంగళవారం అనాథ పిల్లలకు బాలవికాస ‘చేయూత’ కార్యక్రమంలో భాగంగా 230 మందికి రూ.22 లక్షల విద్య సాయం, రూ.4.5 లక్షల విలువైన నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కెనడా దేశం నుంచి బాల థెరిసా జూమ్‌ ద్వారా మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కొనే మనోబలాన్ని పెంపొందించుకోవాలని, విలువలు, పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. బాలవికాస ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సింగారెడ్డి శౌరిరెడ్డి మాట్లాడుతూ అనాథ విద్యార్థులు తల్లిదండ్రులు లేరనే బాధతో కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, అలాంటి వారికి బాలవికాస అండగా ఉంటుందన్నారు. కెనడా, అమెరికా, భారతదేశం నుంచి పలువురు దాతలు ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులతో మాట్లాడారు. బాలవికాస బోర్డు సభ్యులు రమణగుప్తా మాట్లాడుతూ ఎన్ని సమస్యలు ఎదురైనా విద్యార్థులు కష్టపడి చదివి తమ కలలను నెరవేర్చుకోవాలన్నారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా భవిష్యత్‌లో స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో బాలవికాస మేనేజర్‌ డి.లత, శివరాం, జ్యోతి, అమూల్య, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

బాలవికాస వ్యవస్థాపకురాలు

బాలథెరిసా జింగ్రాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement