‘టాస్’ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం
కాళోజీ సెంటర్: ‘టాస్’ అడ్మిషన్ల లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తిచేసి అర్హత గల ప్రతీ అభ్యర్థికి విద్యావకాశాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం సూచించారు. టాస్ అడ్మిషన్ల ప్రక్రియపై మండల సమాఖ్య డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మిషన్, ఆన్‌లైన్ నమోదు విధానం, అవసరమైన పత్రాల అప్‌లోడ్, అడ్మిషన్లు సమర్థవంతంగా పూర్తిచేసే విధానంపై సమగ్ర శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఏపీఎం రాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల టాస్ / ఉల్లాస్ కోఆర్డినేటర్లు నాగేశ్వర్‌రావు, చల్లా రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


