బల్దియా కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: నగరంలో గణేశ్ విగ్రహాల తయారీ, విక్రయంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగించకూడదని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో గణేశ్ విగ్రహాల తయారీదారులు, విక్రయంపై బల్దియా టౌన్‌ప్లానింగ్, ట్రాఫిక్, అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రధాన రహదారులు, డ్రెయినేజీలపై విగ్రహాలు అమ్మకూడదని, విక్రయాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. వరంగల్ ఓ సిటీ, పదాక్ష్మి మైదానం, హయగ్రీవాచారి గ్రౌండ్, ఉర్సు గ్రౌండ్, ఖిలా వరంగల్ మైదానం, పోచమ్మమైదాన్ తోట మైదానంలో విగ్రహాలను విక్రయించాలని సూచించారు. సమావేశంలో ఏసీపీ సత్యనారాయణ, ఎస్‌ఈ రాజ్‌కుమార్, సీపీ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఖలీల్, సీఐలు పాల్గొన్నారు.


