లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి 29న స్విమ్మింగ్‌ పూల్‌ పునఃప్రారంభం విద్యార్థినిపై వార్డెన్‌ అసభ్యకర ప్రవర్తన కానిస్టేబుల్‌పై విచారణకు ఆదేశం నీట్‌ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

వరంగల్‌ లీగల్‌: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 12న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని న్యాయవాదులు, కక్షిదారులకు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత పిలుపునిచ్చారు. రాజీపడదగు క్రిమి నల్‌, సివిల్‌ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్‌ వెహికిల్‌ యాక్సిడెంట్‌ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, ఇన్సూరెన్స్‌ కేసులు, ఎకై ్సజ్‌ కేసులు, ప్రీ–లిటిగేషన్‌ కేసులు, ఇతర కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. లోక్‌ అదాలత్‌పై ఎలాంటి సలహాలు, సందేహాలు, సూచనలకు హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందాలని కోరారు. లోక్‌ అదాలత్‌లో భాగంగా హనుమకొండ కోర్టులో 9, పరకాల కోర్టులో 1 బెంచ్‌ ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: మరమ్మతుల కారణంగా సుమారు ఏడాది పాటు మూతపడిన హనుమకొండలోని డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ పూల్‌, ఇండోర్‌ స్టేడియాన్ని ఈనెల 29న పునఃప్రారంభిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

పోక్సో కేసు నమోదు

హసన్‌పర్తి: హాస్టల్‌లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌పై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధి ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో విధులు నిర్విహిస్తున్న వార్డెన్‌ కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు పాఠశాలకు వచ్చిన నిలదీశారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వార్డెన్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఖిలా వరంగల్‌: మద్యం మత్తులో ఉన్న టీజీఎస్సీ కానిస్టేబుల్‌ను చితకబాదిన మిల్స్‌కాలనీ బీట్‌ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌ కావడంతో దీనిపై ఉన్నతాధికారులు మరింత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ఈనెల 30న నిర్వహించనున్న నీట్‌ పీజీ–26 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీసీపీ దారా కవిత, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతానికి చర్యలు

జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్‌) మ్యాపింగ్‌ కాని, అనామలీస్‌ ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. సోమవారం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌ పాయ్‌ మాట్లాడుతూ... జిల్లాలో ఎస్‌ఐఆర్‌లో మ్యాపింగ్‌ కాని, అనామలీస్‌ జాబితాలో ఉన్న 1.32 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement