వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం వరంగల్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీలను వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్ ప్రారంభించారు. జిల్లా నుంచి సుమారు 350 మంది అధ్లెట్లు పాల్గొన్నారని అసోసియేషన్ కార్యదర్శి యుగెందర్‌రెడ్డి తెలిపారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. విజేతలు ఈ నెల 7వ తేదీన జేఎన్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, పీడీ సాంబమూర్తి, రజినీకాంత్, కృష్ణమూర్తి, మహేందర్, నాగరాజు, తిరుపతి, హరీశ్, శ్రీశైలం, సందీప్ తదితరులు పాల్గొన్నారు.


