హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో ఫైళ్లు మాయమవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూ ళ్లు అందకపోవడంతో ఫైళ్లు మాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విభాగంలో ఈ త తంగం నడుస్తోందని ప్రచారం ఉంది. పర్సనల్ వి భాగంలోని ఓ సెక్షన్‌లో మామూళ్లు ఇచ్చిన వారి ప నులు ఎలాంటి కొర్రీలు లేకుండా చేస్తున్నారు. మా మూళ్లు ఇవ్వని ఉద్యోగులు, అద్దెబస్సుల యజమానులు పనులు పక్కన పడేస్తున్నారని, అవసరమైతే వీరి ఫైళ్లు మాయం చేస్తున్నారనే చర్చ సాగుతోంది.
ఫైళ్లు మాయమవుతున్నా రీజియన్ హెడ్ రీజినల్ మేనేజర్, ఆ తర్వాత స్థాయి అధికారులకు తెలియకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఫైళ్లు మాయమైతే సంస్థ ఉన్నతాధికారికి కనీసం సమాచారం కోసమైనా చెప్పాలి. అయితే ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆయా విభాగాలకు చెందిన సెక్షన్లలో ఏం జరుగుతుందో అధికారులకు తెలియకపోవడం కాదు.. తెలియకుండా చేయడంలో ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆర్టీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఫైళ్లు మాయం చేస్తున్న అదృశ్య శక్తి ఎవరు అనేది యాజమాన్యం విచారణ జరిపి తేల్చాలని ఆర్టీసీ ఉద్యోగులు, అద్దె బస్సుల యజమానులు కోరుతున్నారు. ఆర్టీసీ అద్దె డిపో మార్పు కోసం అనుమతికి వరంగల్–1 డిపో నుంచి వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం ద్వారా ఫైల్ కరీంనగర్ జోనల్ కార్యాలయానికి వెళ్లింది. ఈ ఫైల్ జూన్ 24న వరంగల్ ఆర్‌ఎం కార్యాలయానికి పంపినట్లు కరీంనగర్ జోన్ కార్యాలయంలోని ఔట్‌వార్డు రిజిస్టర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది సాధారణంగా జరిగే తంతు. ఈ ఫైల్ ఇప్పటి వరకు వరంగల్ ఆర్‌ఎం కార్యాలయానికి చేరుకోలేదని సంబంధిత సెక్షన్ బాధ్యులు చెప్పారని అద్దె బస్సుల యజమానులు పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత సెక్షన్ ఉద్యోగిని ఫైల్ మాయంపై సాక్షి వివరణ కోరగా అద్దె బస్సు డిపో మార్పు ఫైల్ వరంగల్ ఆర్‌ఎం కార్యాలయానికి చేరలేదని, జోన్ కార్యాలయం నుంచి ఫైల్ వచ్చిందని అద్దె బస్సుల యజమానులు తెలిపారని తనకు ఈ విషయం తెలియదని పేర్కొన్నారు. గతంలో సిబ్బంది అప్పీల్‌కు సంబందించిన మూడు నాలుగు ఫైళ్లు కూడా ఇలాగే రాలేదని తెలిపారు.
వరంగల్ రీజినల్ మేనేజర్
కార్యాలయంలో అదృశ్యం
సంబంధిత పనికి మామూళ్లు
ఇవ్వనందుకే అనే ఆరోపణలు
ఈ సెక్షన్ చూస్తున్న ఉద్యోగిపై
అనుమానాలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల
నియామకంలోను వసూలు చేశాడనే
ఆరోపణ
పర్సనల్ విభాగంలో అక్రమాలు..
పర్సనల్ విభాగంలో అవినీతి పెరిగిందనేది బహిరంగ రహస్యం. ఔట్ సోర్సింగ్ కండక్టర్, డ్రైవర్ల నియామకంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్మకానికి పెట్టడంతో పాటు అవసరం లేకుండా అభ్యర్థుల వద్ద డబ్బులు వసూలు చేసి ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి పక్కన పెట్టారని పలువురు చెప్పడం గమనార్హం. 100 మందిని కండక్టర్లుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన తర్వాత ఆరు నెలలుగా విధుల్లోకి తీసుకోలేదు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమయంలో కొంత మందిని తీసుకున్నారు. సమ్మె ముగియగానే వారిని తీసివేశారు. కండక్టర్లు, డ్రైవర్ల నియామకంలో కండక్టర్ అభ్యర్థుల నుంచి రూ.50 నుంచి రూ.2 లక్షల వరకు, డ్రైవర్ అభ్యర్థుల నుంచి రూ.30 నుంచి రూ.50 వేలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదీ చాలనట్లు అద్దె బస్సులకు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓసారి సీఓ చేయిస్తారు. సీఓ చేయడానికి ప్రతి అద్దె బస్సు నుంచి కనీసం రూ.వెయ్యి వసూలు చేస్తారని తెలిసింది. వరంగల్ రీజియన్‌లో 368 బస్సులున్నాయి. ఈ లెక్కన నాలుగు సంవత్సరాలకు ఓసారి అద్దె బస్సులపై రూ.3,68,000 వసూలు చేస్తున్నారని అద్దె బస్సుల యాజమానులు చర్చించుకుంటున్నారు. కండక్టర్ వద్ద రూ.1 ఫ్రాడ్ జరిగినా, కావాలని చేసినా, అనుకోకుండా జరిగినా ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్న ఉన్నతాధికారులు రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఫైళ్లు మాయం కావడం, పెద్ద ఎత్తున అవినీతి వేళ్లూనుకుపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా విచారణ జరిపి ఫైళ్ల మాయం వెనుక ఉన్న అదృశ్య శక్తిని గుర్తించి, మామూళ్ల మత్తులో జోగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, అద్దె బస్సు యజమానులు డిమాండ్ చేస్తున్నారు.


