‘ఆపరేషన్‌ ముస్కాన్‌’తో 314 మందికి విముక్తి | - | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌ ముస్కాన్‌’తో 314 మందికి విముక్తి

Aug 2 2026 12:34 AM | Updated on Aug 2 2026 12:34 AM

వరంగల్‌ క్రైం : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జూలై నెలలో 314 మంది చిన్నారులకు పనుల నుంచి విముక్తి లభించిందని సీపీ శ్వేత తెలిపారు. రక్షించబడిన చిన్నారుల్లో 269 మంది బాలురు, 45 మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు. ఇందులో బిహార్‌, మహారాష్ట్ర, కర్నాటక, రాజస్తాన్‌, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, అసోం రాష్ట్రాలకు చెందిన 130 మంది ఉన్నట్లు తెలిపారు. ప్రమాదకర పనుల నుంచి చిన్నారులను కాపాడిన వారిలో పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉన్నట్లు సీపీ శ్వేత వివరించారు.

ఓరుగల్లు నేత

కళాకారులకు అవార్డులు

7న హైదరాబాద్‌లో ప్రదానం

కాశిబుగ్గ: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డులకు ఇద్దరు ఓరుగల్లు చేనేత కళాకారులు ఎంపికయ్యారు. చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన చేనేత కళాకారులకు ప్రభుత్వం కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డులు ప్రదానం చేయనుంది. ఈ నేపథ్యంలో వరంగల్‌ కొత్తవాడలోని గోరంటల (పిట్ట) రాజు, కరీమాబాద్‌ ప్రాంతానికి చెందిన కంచె సమత ఎంపికై నట్లు చేనేత జౌళి శాఖ అధికారులు తెలిపారు. జిల్లా నుంచి నలుగురు చేనేత కళాకారులు దరఖాస్తు చేసుకోగా ఇద్దరిని అవార్డు కమిటీ ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు. వీరిలో నేత కార్మికుడు రాజు దర్రీస్‌పై జాతీయ పక్షి, నేత కార్మికురాలు సమత దర్రీస్‌పై సముద్రంలో ప్రయాణిస్తున్న పడవ చిత్రపటాన్ని నేశారు. ఆగస్టు 7న హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో జరిగే చేనేత దినోత్స సభలో సీఎం చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. ఈ అవార్డు కిందద రూ.25వేల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసపత్రం అందిస్తారు. ఇద్దరు చేనేత కళాకారులకు అవార్డులు రావడం పట్ల టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిప్ప వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. అలాగే ఈ అవార్డుల కోసం జిల్లా నుంచి సహకరించిన అధికారులు శ్రీకాంత్‌రెడ్డి, సుధీర్‌కు ఆయన కృతజ్ఞతలు పేర్కొన్నారు.

ఎస్సై, కానిస్టేబుల్‌

అభ్యర్థులకు ఉచిత శిక్షణ

కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని అంబేడ్కర్‌ స్టడీ సెంటర్‌ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు కేయూ రిజిస్ట్రార్‌, అంబేడ్కర్‌ స్టడీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం, ఇన్‌చార్జ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పుల్లా శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈనెల 7వ తేదీ వరకు అంబేడ్కర్‌ స్డడీ సెంటర్‌లో దరఖాస్తులు అందజేయాలని సూ చించారు. నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement