కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామన్ మెస్ విద్యార్థులు తమకు మెస్‌బిల్లులు అధికంగా వచ్చాయని నిరసిస్తూ శనివారం క్యాంపస్‌లోని పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, హాస్టళ్ల డైరెక్టర్ పి. శ్రీనివాస్ అకడమిక్ కమిటీహాల్‌లో విద్యార్థులతో సమావేశం నిర్వహించి చర్చించారు. బీఫార్మసీ కో ర్సు పూర్తి చేసిన విద్యార్థులు తమకు మెస్‌బిల్లులు అధికంగా వచ్చాయన్నారు. ఈఏడాదిలో ఉదాహరణకు ఫిబ్రవరి నెలకు వెల్లడించిన మెస్‌బిల్లులో ఒక్కోవిద్యార్థికి తొలుత రూ.2,600గా చూపారు. ఆతర్వాత హాస్టల్ ఆఫీస్‌లోని లెడ్జర్లలో రూ. 3,100గా చూపారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో అధికారులు వెంటనే హాస్టల్ ఆఫీస్ నుంచి లెడ్జర్ తెప్పించి పరిశీలించగా వాస్తమేననేది వెల్లడైంది. దీంతో అధికారుల అవాక్కయ్యారు. దీనిపై సంబంధిత ప్రస్తుత హాస్టల్ డైరెక్టర్ శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. గత హాస్టల్ డైరెక్టర్ హయాంలోని బిల్లు అని చర్చించారు. ఇలా పలు నెలల్లోని బిల్లులు కూడా ఇలానే ఉంటాయని విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. బీఫార్మసీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు మాత్రం తమకు నోడ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విచారణ కమిటీవేసే యోచన!
కామన్ మెస్ బిల్లులో భారీగా తేడాలున్నాయనే ఆ రోపణల నేపథ్యంలో ఆయా బిల్లుల పరిశీలనకు వి చారణ కమిటీ వేయాలనే యోచనలో యూనివర్సి టీ అధికారులు ఉన్నారని ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ కె. రా జేందర్ తెలిపారు. ఇదిలా ఉండగా కేయూ వీసీ ప్ర తాప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అప్ప టి హాస్టల్ డైరెక్టర్ రాజకుమార్ హయాంలోని బిల్లులకు సంబంధించిన లెడ్జర్లను కూడా పరిశీలించాల ని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు.. రిజిస్ట్రార్ వి. రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
మెస్‌బిల్లులు అఽధికంగా వచ్చాయని
నిరసన


