● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాతా–శిశు ఆరోగ్యం, టీబీ ముక్త్ భారత్, సార్వత్రిక టీకాలు, అసంక్రమిత వ్యాధులు, సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.
వేగంగా కొనసాగుతున్న డిజిటైజేషన్
ఎస్‌ఐఆర్‌లో ఓటర్ల వివరాల డిజిటైజేషన్‌ను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బుధవారం నిర్వహించిన వీడియో సమావేశంలో ఎస్‌ఐఆర్ పురోగతి, డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీఓలు వెంకటేశ్, వెంకన్న, జిల్లా ఎన్నికల పర్యవేక్షకుడు జగత్ సింగ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల రక్షణే లక్ష్యం
కాజీపేట అర్బన్: ప్రభుత్వ భూముల రక్షణే లక్ష్యంగా భూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థ్ధితులు ఒకేలా ఉండాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు సూచించారు. కాజీపేట మండలం భట్టుపల్లిలో గతంలో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సీహెచ్.రాజు, ఆర్‌ఐ కృష్ణ,సర్వేయర్ స్టాలిన్ తదితరులున్నారు.
ముంపు నివారణకు చర్యలు చేపట్టండి
హన్మకొండ: వర్షాకాలంలో నాలాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. బుధవారం హనుమకొండలోని వంద ఫీట్ల రోడ్డు, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, గోపాలపూర్ ఊర చెరువు ప్రాంతాలను, నాలాను, నాలపై నిర్మిస్తున్న కల్వర్లు స్లాబ్‌ల నిర్మాణాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


