గీసుకొండ: వరంగల్ డీఎంహెచ్‌ఓగా గ్రేటర్ వరంగల్ నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంహెచ్‌ఓ) రాజారెడ్డికి అదనపు (ఇన్‌చార్జ్) బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు ఇటీవల ప్రమాదంలో గాయపడడంతో సెలవులో ఉన్నారు. దీంతో రాజారెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. రేపు (శుక్రవారం) ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
కాశిబుగ్గ: వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 మంది మైనర్లు వాహనాలు నడుపుతుండగా.. గుర్తించి, వారిపై జువైనల్ కోర్టులో చార్జ్‌షీట్ ఫైల్ చేసినట్లు ట్రాఫిక్ సీఐ కె.సుజాత తెలిపారు. బుధవారం వీరిని జువైనల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ఒకరోజు పాటు బాలల అబ్జర్వేషన్ హోమ్‌కు పంపించారని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరికి వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అంకేశ్వరపు కమలాకర్ రూ.300, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 8 మందికి రూ.6,100 జరిమానా విధించినట్లు ఆమె వివరించారు.


