కాశిబుగ్గ: దేశాయిపేటలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు వేరే పాఠశాలకు మార్చినట్లు వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. విద్యార్థుల వసతి, భద్రత దృష్ట్యా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్థానికంగా ఖాళీగా ఉన్న ఎయిడెడ్ నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మండల విద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, మాజీ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పద్మ, నెహ్రూ మెమోరియల్ స్కూల్ కరస్పాండెంట్ వేద ప్రకాశ్, ట్రస్ట్ సభ్యులు పూతల మధు, పూర్వ విద్యార్థులు అశోక్, సూర్య ప్రకాశ్, పాలడుగుల సురేందర్, హెడ్‌మాస్టర్లు భూముల రాజేష్, ఉషారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు


