వరంగల్ అర్బన్: అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించి, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. బుధవారం వరంగల్ కాశిబు గ్గ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ ఆవరణలోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, బర్త్ అండ్ డెత్ విభాగాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి నిర్వహిస్తున్న వీధుల తీరును అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా జనన, మరణ విభాగాలను సందర్శించి, వివరాలు అడిగి రికార్డులు పరిశీలించారు. తనిఖీల్లో కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఏసీపీ ఖలీల్, సూపరింటెండెంట్ రామకృష్ణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కమిషనర్ వెంకన్న
కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయం తనిఖీ


