కాశిబుగ్గ: ‘ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే కింద ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఏసీబీకి ఆన్‌లైన్‌లో కంప్లైంట్ చేయండి’ అంటూ ఎంజీఎంలో పలు చోట్ల క్యూ ఆర్ కోడ్‌ల పోస్టర్లు అతికించారు. ఈమేరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ వినూత్న ఏర్పాటు చేశారు. ఎంజీఎంలో దాదాపు 30 చోట్ల స్టిక్కర్లు అంటించి అవినీతి జరగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేశారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేస్తే ఏసీబీ అఽధికారులు రహస్యంగా వచ్చి డబ్బులు అడిగినవారిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని వారు వివరించారు.
ఎంజీఎంలో పలు చోట్ల గోడలపై క్యూఆర్ కోడ్‌లు
స్కాన్ చేసి ఫిర్యాదు చేస్తే డబ్బులడిగిన వారిపై చర్యలు


