
పెన్షన్, జీపీఎఫ్‌పై అవగాహన ఉండాలి
● హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్
హన్మకొండ అర్బన్ : విరమణ పొందే ఉద్యోగులు పెన్షన్, జీపీఎఫ్‌పై అవగాహన పెంపొందించుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్ సమస్యలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పెన్షన్, జీపీఎఫ్‌పై ఖజానా శాఖ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి పూర్తి తెలుసుకోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, హైదరాబాద్ ఏజీ కార్యాలయ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అభయ్ అనిల్ సొనార్కర్, నరేశ్‌కుమార్ మాట్లాడుతూ పెన్షన్, జీపీఎఫ్ సమస్యల పరిష్కారం కోసం ఆదాలత్ నిర్వహించామని, తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు, జీపీఎఫ్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. వరంగల్, హనుమకొండ డీఆర్‌ఓలు వై.వి గణేశ్, విజయలక్ష్మి, హనుమకొండ జిల్లా డీటీఓ శ్రీనివాసకుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాల డీడీఓలు, పెన్షనర్లు, తదితరులు పాల్గొన్నారు.