
ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు
హసన్‌పర్తి: నగరంలోని కిట్స్ ఇంజనీరింగ్ కశాశాల ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టేబుల్ టెన్నిస్ వెటరన్ క్రీడాకారుడు రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ, స్నేహభావం పెంపొందుతుందన్నారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరీశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కిట్స్ కళాశాల ఏఓ డాక్టర్ రమేశ్‌రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మోహన్‌రావు, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్ జైసింగ్ అజ్మీరా, సునీల్‌కుమార్, కార్యనిర్వాహక సభ్యులు రవికుమార్, వెంకటస్వామి, మహేశ్, డాక్టర్ ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు.