
గూడ్స్‌షెడ్‌కు భారీగా ఎరువులు
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్‌షెడ్‌కు ఆదివారం కోరమండల్ కంపెనీకి చెందిన ఎరువులు భారీగా వచ్చాయి. 20:20:0:13 రకం 1844 మెట్రిక్ టన్నులు, 15:15:15 రకం 526 మెట్రిక్ టన్నులు, 16:20:0:13 రకం 319 మెట్రిక్ టన్నులు చేరాయి. కోరమండల్ ఎరువులను రికార్డుల ప్రకారం వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్‌రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ సత్యశారద, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఆదేశాల ప్రకారం కోరమండల్ ఎరువులను నిబంధనల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పీఏసీఎస్ గోదాంలు, ఫర్టిలైజర్ షాపులకు పంపించనున్నట్లు వ్యవసాయ అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. అలాగే, సోమవారం ఆర్‌సీఎఫ్ కంపెనీకి చెందిన 1,319.12 మెట్రిక్ టన్నుల యూరియా నగరానికి రానుందని, దీంతో ఉమ్మడి జిల్లా రైతుల యూరియా కష్టాలు తీరనున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పేర్కొన్నారు.