
ఇన్‌స్పైర్ నామినేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
విద్యారణ్యపురి: ఇన్‌స్పైర్ నామినేషన్ల ప్రక్రియ వేగవంతానికి ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి కోరారు. శనివారం హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జిల్లాలోని అన్ని మండలాల ఇన్‌స్పైర్ ఇన్‌చార్జ్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెలాఖరు వరకు నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సదస్సులో హనుమకొండ ఎంఈఓ గుగులోతు నెహ్రూనాయక్, రిసోర్స్‌పర్సన్లు పోతరాజు ఆనందం, దొంతుల శ్రీనివాస్, అమరకొండ సంపత్, ఉపాధ్యాయులకు ఇన్‌స్పైర్ అవార్డులకు నామినేషన్లు పంపే విధానంపై అవగాహన కల్పించారు.
విద్యారణ్యపురి: స్వయం సాధికారత దిశగా పరిశోధన ఫలితాలు ఉండాలని కేయూ కెమిస్ట్రీ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ప్రొఫెసర్ సవితాజ్యోత్స్న అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కెమికల్ అండ్ ఆలై డ్ సైన్సెస్ రీసెర్చ్’ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి, సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పి.రమేశ్, సెమినార్ కన్వీనర్ ఎం. అరుణ, కో కన్వీనర్ ప్రశాంతి అధ్యాపకులు ఉదయశ్రీ, బాలరాజు, జ్యోతి, శ్రీనివాస్, వి.శ్రీనివాస్, శాంతికుమార్, రవీందర్, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, సురేశ్‌బాబు ఉన్నారు.
న్యూశాయంపేట: సీపీఐ రాష్ట్ర సమితిలో హనుమకొండ జిల్లాకు సముచిత స్థానం లభించింది. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కర్రె భిక్షపతి, నేదునూరి జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జరిగిన పార్టీ 4వ రాష్ట్ర మహాసభల్లో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారితో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఆదరి శ్రీనివాస్, సిరబోయిన కరుణాకర్, మండ సదాలక్ష్మి, ప్రత్యేక ఆహ్వానితుడిగా తోట భిక్షపతిని ఎన్నుకున్నారు. జిల్లాకు సముచిత స్థానం దక్కడంతో నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్టేషనరీ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఔట్ పేషెంట్ (ఓపీ) అందించే పేపర్లు లేకపోవడంతో శనివారం వైద్యులు తెల్లపేపర్‌పై రాసి ఇస్తున్నారు. దీని వల్ల మెడికల్ లీగల్ కేసులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఇన్‌పేషెంట్ అడ్మిట్ చేసేందుకు కేస్ షీట్‌లు ఓపీ విభాగంలో అందుబాటులో లేకపోవడంతో వైద్యసిబ్బంది ఎమర్జెన్సీ బ్లాక్‌కు పరుగులు పెట్టాల్సి వస్తుంది. బడ్జెట్ లేమితో స్టేషనరీ కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించపోవడంతో అరకొర స్టేషనరీ సరఫరా చేస్తున్నాడని, దీనిద్వారా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు
విద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు అందజేయనున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా విద్యాశాఖ, భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ సంయుక్తంగా హనుమకొండ డైట్ కాలేజీలో ప్రత్యేక అవసరాల పిల్లల క్యాంపు నిర్వహించారు. 14 మండలాలనుంచి 174మంది బాలబాలికలు హాజరయ్యారు. డాక్టర్లు కోమల్‌పాద్, రాజుహైదర్, ఎన్.దీప్తి, మాధవి, ఫిజియోథెరపిస్ట్ శివకృష్ణ పాల్గొని వారికి ఎలాంటి పరికరాలు అవసరమో నిర్ధారించారు. పిల్లలకు త్వరలోనే పరికరాలు అందజేస్తామని బద్దం సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు శ్రీధర్, సరస్వతి, ప్రవీణ్, శ్రీను, రఘుబాబు, తిరుపతి, భవన్, సుమన్, రజిత, యశోద, రజని, రవి తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌స్పైర్ నామినేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి

ఇన్‌స్పైర్ నామినేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి

ఇన్‌స్పైర్ నామినేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి