
హన్మకొండ జిల్లా: ఎవరు కుళ్లుకున్నా తన పని తాను చేసుకుపోవడమే తనకు తెలుసని ఎమ్మెల్యే కడియం శ్రీహారి స్పష్టం చేశారు. పని చేయని వారు దొంగలాగ పారిపోతారని, తాను పని చేశాను కాబట్టే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానన్నారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ప్రజలకు సూచించారు.
ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24వ తేదీ) జిల్లాలోని ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘ నాలాగ పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం. నేను ఒక్క రూపాయి లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అవినీతికి కాకుండా అభివృద్ధికి సహకరించండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.