మంచిర్యాల జిల్లా: పంచాయతీ ఎన్నికల వేళ కొందరు నామినేషన్ వేసిన మరుక్షణమే ప్ర చారం మొదలు పెట్టారు. మండలంలో ని ముత్యంపేట పంచాయతీలో 6వ వా ర్డులో పోటీచేస్తున్న కొండా రజిత, తన భర్తతో కలిసి ఆదివారం ప్రచారం మొదలు పెట్టింది. ఓ ఇంటికి వెళ్లగా నర్సయ్య అనే ఓటరు ఆరుబయట స్నానం చేస్తుండగా, అభ్యర్థి భర్త అతని వీపు రుద్దుతూ, నీ ఓటు నా భార్యకు వేయాలని అభ్యర్థించాడు. ఈ దృశ్యాన్ని నరేశ్ వీడియోలో చిత్రీకరించి వాట్సాప్ స్టేటస్ ద్వారా వినూత్న ప్రచారం చేస్తున్నాడు.
నామినేషన్ వేసిన మరుసటి రోజే గుండెపోటు
మహిళ మృతి..పొన్కల్‌లో ఘటన
మామడ: వార్డు మెంబర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన మరుసటి రోజే మహిళ గుండెపోటుతో మృతిచెందింది. మండలంలోని పొన్కల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలో 12వ వార్డు మెంబర్‌గా పోటీ చేసేందుకు దుబాక జమున (50) శనివారం నామినేషన్ వేసింది. మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇంతలోనే ఆదివారం జమునకు గుండెపోటుకు గురై మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.


