టెట్‌పై ఆందోళన వద్దు
బాసర: టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) తప్పనిసరిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. బాసర సరస్వతీ అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయనను మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి, పదోన్నతులు ఇప్పిస్తామని తెలిపారు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్.భూమన్న యాదవ్, ఎ.బాజారెడ్డి, పల్సీకర్ శ్రీనివాస్, జిల్లా పూర్వ అధ్యక్షుడు డి.రామారావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి బి.వెంకటేశ్వర్ రావు, బాసర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేందర్‌రావు, రవీందర్, నాయకులు గణపతి, గంగాధర్, శ్రీనివాస్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.


