కంచరోని చెరువు ఖాళీ
చేపలు పట్టాలంటే.. మత్స్యకారులు వలలు వేసి.. పడతారు. పడవలో వెళ్లి వేట సాగిస్తారు. కానీ నిర్మల్‌లో మత్స్యకారులు మాత్రం విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. చెరువులో చేపలు పట్టుకునేందుకు చెరువునే ఖాళీ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రం చుట్టూ 12 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల కారణంగానే నిర్మల్ పట్టణానికి ఇప్పటి వరకు నీటి సమస్య రాలేదు. తాజాగా కంచరోని చెరువు నీరులేక వెలవెలబోతోంది. స్థానిక మత్స్యకారులు ఈచెరువును ఖాళీ చేశారు. నవంబర్ 8న చెరువులో మత్స్యకారులు చేపలు పట్టారు. మరోమారు చేపలు పట్టాలన్న ఉద్దేశంతో మరుసటి రోజు చెరువులోని నీటిని తూము ద్వారా వదిలేశారు. దీంతో 20 రోజుల్లో చెరువు మొత్తం ఖాళీ అయింది. దీంతో చెరువులోని చేపలు, జలచరాలు చనిపోతున్నాయి. చెరువు ఖాళీ కావడంపై నీటిపారుదల శాఖ అధికారులను వివరణ కోరగా, మత్స్యకారులే నీటిని వదిలేశారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్
కంచరోని చెరువు ఖాళీ
కంచరోని చెరువు ఖాళీ


