నామినేషన్ కేంద్రాల తనిఖీ
లక్ష్మణచాంద/పెంబి: పంచాయతీ నామినేషన్లు పకడ్బందీగా స్వీకరించాలని గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం అధికారులను ఆదేశించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో భాగంగా సోన్ మండలంలోని కడ్తాల్, సోన్, పెంబి, మందపల్లిలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆదివారం తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనంతరం నామినేషన్ పత్రాలు, ధృవీకరణ, అభ్యర్థుల వివరాలను పరిశీలించారు. హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి నామినేషన్లు వేయడానికి వచ్చే వారికి సహాయం చేయాలని సూచించారు. ఆమె వెంట కడ్తాల్ జీపీవో గంగాధర్, ఎంపీడీవోలు సుధాకర్, రమేష్, ఎంపీవో అనిల్ కుమార్ ఉన్నారు.


