అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి శ్రీమహాపోచమ్మ దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.


