ఏం కొనేటట్టు లేదు..
ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు తగ్గిన దిగుబడి.. పెరిగిన రేట్లు
లక్ష్మణచాంద:ప్రస్తుతం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులను కష్టాల్లోకి తోసేస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారానికి కూరగాయలు తప్పనిసరి. ఇప్పుడు రెండు కిలోల కూరగాయలు కొనాలన్నా రూ.200 దాటిపోతున్నాయి. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై ఇది గట్టి దెబ్బ. ఇప్పటికే జిల్లాలో కూరగాయల సాగు అంతంత మాత్రంగా ఉంది. అక్టోబర్ చివరి వారంలో మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆ పంటలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో వ్యాపారులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు.
కార్తిక మాసం, అయ్యప్ప దీక్షలు..
మరోవైపు కార్తిక మాసంలో మాంసాహారం తినేవారు తక్కువ. కూరగాయలే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇక ఇదే మాసంలో అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యాయి. మండల దీక్షలతో దీక్షస్వాములు, వారి కుటుంబ సభ్యులు కూడా కూరగాయల భోజనం చేస్తారు. దీంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. ధరలు పెరిగాయి. ఇక షష్టి వారాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం కూడా కూరగాయల ధరలపై పడింది.
ధరల పెరుగుదలకు కారణాలు..
మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా...
కూరగాయలు ధర కిలోకు..
టమాటా రూ.50– 60
వంకాయలు రూ.80–100
చిక్కుడు రూ.100
బెండ రూ.100
బీర రూ.100
పచ్చిమిర్చి రూ.80
క్యాబేజీ రూ.80
కాలీఫ్లవర్ రూ.80
ఆలుగడ్డలు రూ. 40
తోటకూర రూ.50


