● ఎస్పీ జానకీషర్మిల
స్వేచ్ఛగా ఓటు వేయాలి
నిర్మల్‌టౌన్: పంచాయతీ ఎన్నికల్లో నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఎ స్పీ జానకీషర్మిల సూచించారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. చెక్‌పోస్టుల కార్యకలాపాల పర్యవేక్షణ, సున్నితమైన ప్రాంతాల గుర్తింపు, మొబైల్ వాహనాల మానిటరింగ్ వంటి అంశాలపై చర్చించారు. అనుమానాస్పదంగా కనిపించి నా, కోడ్ ఉల్లంఘించినా వెంటనే పోలీసులకు తెలి యజేయాలని సూచించారు. నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.


