490మంది ఎస్‌ఏలకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులు | - | Sakshi
Sakshi News home page

490మంది ఎస్‌ఏలకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులు

Aug 22 2025 3:02 AM | Updated on Aug 22 2025 3:02 AM

490మం

490మంది ఎస్‌ఏలకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులు

ప్రదీప్‌రావు ప్యానల్‌ ఘన విజయం

విద్యారణ్యపురి: మల్టీజోన్‌ –1 పరిధి వరంగల్‌ పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ పరిఽధిలోని 19 జిల్లాల్లోని 490మంది స్కూల్‌ అసిస్టెంట్‌లకు హెడ్మాస్టర్లు (గ్రేడ్‌–2) పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఇందులో ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని హైస్కూల్స్‌ కు 53మంది స్కూల్‌ అసిస్టెంట్‌లు హెడ్మాస్టర్లుగా, లోకల్‌బాడీ యాజమాన్యాల పరిధిలోని 437 మంది ఎస్‌ఏలు హెడ్మాస్టర్లుగా పదోన్నతి పొందారు. వీరు తమకు కేటాయించిన హైస్కూల్స్‌లో జాయిన్‌ అయ్యేందుకు 15 రోజుల సమయం ఉంటుంది. కానీ ఆయా స్కూల్‌ అసిస్టెంట్‌లు ఎక్కువశాతం మంది ఈ నెల 22న రిలీవ్‌ అయి వెంటనే హెడ్మా స్టర్లుగా జాయిన్‌ కానున్నారని సమాచారం.

నేటినుంచి దూరవిద్య డిగ్రీ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం జనరల్‌, కంప్యూటర్స్‌, బీఎస్సీ మొదటి, ద్వితీయ, ఫైనలియర్‌ ఎక్స్‌, రెగ్యులర్‌ విద్యార్థులకు ఈనెల 22 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ గురువారం తెలిపారు. ఈనెల 22, 26, 30, సెప్టెంబర్‌ 3, 8,11 తేదీల్లో ఫైనలియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. దూరవిద్య డిగ్రీ సెకండియర్‌ విద్యార్థులకు ఈనెల 23, 28,సెప్టెబర్‌ 1, 4, 9, 11, 17 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 25, 29,సెప్టెంబర్‌ 2, 6, 10, 15, 18వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పద్మజ తెలిపారు. కేయూ దూరవిద్య కేంద్రం పరిధిలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని పద్మజ తెలిపారు.

ఏటీఎం గోడను ఢీకొట్టిన గూడ్స్‌ రైలు

వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో

త్రుటిలో తప్పిన ప్రమాదం

ఖిలా వరంగల్‌: వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో గూడ్స్‌ రైలు పార్కింగ్‌ కోసం గురువారం ఉదయం వెనక్కి ప్ర యాణిస్తూ ఏటీఎం గోడను ఢీకొట్టింది. దీంతో ఎవరికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తెలిసిన ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్సై వెంకటేశ్వర్లు, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గూడ్స్‌ రైలు ఢీకొట్టిన ఏటీఎం గోడను పరిశీలించారు. రైలు వెనక్కి వెళ్తూ అకస్మాత్తుగా గోడను ఢీకొట్టిందన్నారు.

రామన్నపేట : వరంగల్‌ కో–అపరేటివ్‌ బ్యాంకు కార్యవర్గ ఎన్నికల్లో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ప్యానల్‌ ఘన విజయం సాధించింది. గురువారం నగరంలోని ఏవీవీ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 6,638 ఓట్లు ఉండగా ఇందులో 2,442 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి వాల్యానాయక్‌ తెలిపా రు. వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రదీప్‌ రా వుకు 2,166 ఓట్లు సాధించి భారీ మోజార్టీతో విజ యం సాధించారు. అదేవిధంగా ప్రదీప్‌రావు ప్యా నల్‌ సభ్యులంతా ఘన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి వాల్యానాయక్‌ తెలిపారు.

490మంది ఎస్‌ఏలకు  హెడ్మాస్టర్లుగా పదోన్నతులు1
1/1

490మంది ఎస్‌ఏలకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement