
ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
● ప్రజావాణిలో వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 92 దరఖాస్తులు వచ్చాయి. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఆరెంజ్ అలెర్ట్ నేపథ్యంలో..
వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, రోడ్డు, రవాణా, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు శాఖల వారీగా అంతర్గత సమావేశాలు నిర్వహించుకుని పరిస్థితులకనుగుణంగా సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.
కొత్త కలెక్టరేట్‌లో గదిని కేటాయించండి
వరంగల్ ఆజాంజాహి మిల్లులో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్‌లో పెన్షనర్స్‌కు సేవలు అందించడానికి ఒక గదిని కేటాయించాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు హనుమకొండలో మాదిరి మాకు కూడా గదిని కేటాయిస్తే పదవి విరమణ ఉద్యోగులకు ఉచిత సేవలను అందించేందుకు తోడ్పాటు అందిస్తాం.
– పెన్షనర్స్ అసోషియేషన్, వరంగల్