
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
రామన్నపేట: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. డివిజన్ల వారీగా పలు పథకాల కింద కొనసాగుతున్న, చేపట్టబోయే పనులకు సంబంధించి పలు సూచనలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 66వ డివిజన్‌కు మంజూరైన పనులను తక్షణమే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించే డ్రెయిన్లు, స్ట్రాంగ్ వాటర్ డ్రెయిన్లు, అభివృద్ధి పనుల ఎస్టిమేషన్ వెంటనే సమర్పించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోశ్‌బాబు, డీఈఈలు రవికిరణ్, సాంగం రోజారాణి, ఏఈలు వర్క్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
పూడిక తొలగించాలి..
వరదనీరు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు పూడిక తొలగించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. సోమవారం 13, 22 డివిజన్ల పరిధి ఏకశిలానగర్, దేశాయిపేటరోడ్డు, చిన్నవడ్డేపల్లి చెరువుకట్ట ప్రాంతాలతోపాటు 22వ డివిజన్ పరిధిలోని కొత్తవాడ, బ్యాంక్ కాలనీ, మర్రివెంకటయ్య కాలనీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేశ్‌జోషి, బసవరాజు కుమారస్వామి, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
మేయర్ గుండు సుధారాణి
అధికారులతో సమీక్ష