
భగవద్గీత నాకు శక్తిని ప్రసాదించింది..
గోకుల్‌నగర్‌లో
ఉట్టికొడుతున్న యువకులు
హన్మకొండ అర్బన్: ‘నేను జైలు జీవితం గడిపిన రోజుల్లో భగవద్గీత చదివా.. ఆ రోజు నుంచి నేను ప్రజల్లో ఉండడానికి.. ఈ స్థాయికి ఎదగడానికి ఆ భగవద్గీతే నాకు శక్తిని ఇచ్చింది.. మన సంస్కృతి, సంప్రదా యాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది’ అని హరి యాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ రాంనగర్‌లోని బీసీ భవన్ నుంచి పబ్లిక్ గార్డెన్, అశోకా జంక్షన్ మీదుగా కాళోజీ కళాక్షేత్రం వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం కళాక్షేత్రంలో కృష్ణ తత్వంపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు సుందర్‌రాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో కృష్ణ తత్వం జీవితానికి, స మాజానికి రక్ష అన్నారు. అదేవిధంగా పల్లెల్లో గోశాలలు, పశు సంపదను వృద్ధి చేసుకుంటూ సంరక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సమాజంలో సీ్త్రలకు సమాన గౌరవం దక్కాలన్నారు. గ్రామాల్లో పశుసంపద వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని, అందుకు తగ్గ ప్రణాళికలు రచించి అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చలనచిత్ర రంగంలో రాణిస్తున్న యాదవ ప్రతినిధులు, ఇతర రంగాల్లోని వారిని వేదిక పైకి పిలిచి పరి చయం చేసి అభినందించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే మా ర్తినేని ధర్మారావు, ఇతర యాదవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, రాత్రి గోకుల్‌నగర్‌లో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు.
గో సంపదను విస్తరించాలి
సంస్కతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ గవర్నర్ దత్తాత్రేయ

భగవద్గీత నాకు శక్తిని ప్రసాదించింది..

భగవద్గీత నాకు శక్తిని ప్రసాదించింది..