రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే సీతక్క పీఏ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే సీతక్క పీఏ దుర్మరణం

Sep 3 2023 1:08 AM | Updated on Sep 3 2023 6:17 PM

- - Sakshi

ములుగు: జిల్లా కేంద్రంలోని సాధన హైస్కూల్‌ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అంతర్గత పీఏ కొట్టం వెంకటనారాయణ(జబ్బర్‌) (36) దుర్మరణం పాలయ్యారు. వెంకటనారాయణ వ్యక్తిగత పనిమీద నర్సంపేటకు బైక్‌పై వెళ్లాడు. పని ముగించుకుని ములుగుకు చేరుకున్న ఆయన ఇంటికి వెళ్తున్న క్రమంలో సాధన హైస్కూల్‌ సమీపంలోకి రాగానే బైక్‌ స్కిడ్‌ అయ్యి డివైడర్‌ను ఢీకొట్టాడు.

తల రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్రరక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంకటనారాయణ సీతక్క వద్ద 8 సంవత్సరాలుగా అంతర్గత పీఏగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య సుమలత ఉంది. ఆమె స్థానికంగా కాంట్రాక్ట్‌ టీచర్‌గా పనిచేస్తుంది. ఒక కూతురు ఉంది. కాగా, హెల్మెట్‌ ఉంటే బతికేవాడని, తలకు బలమైన గాయాలు కావడంతో రక్తస్రావమై చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement