వరంగల్ నగరంలో గొలుసుకట్టు చెరువులు పలుచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. భద్రకాళి, వడ్డేపల్లి చెరువులతో పాటు అనేక చోట్ల కబ్జాలు చేసి ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకున్నారు. భవనాలు, అపార్టుమెంట్ల నిర్మాణాలు జరిగాయి. 2014 వరకు రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదైన చెరువులోని నిర్మాణాలకు ఇంటి నంబర్లు ఎలా వచ్చాయో తెలియదు. ఇప్పటికై నా చెరువుల పరిరక్షణ కమిటీ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు, వినియోగదారుల మండలి
●


