ఇంటి సామగ్రి కడుగుతుండగా.. మహిళను కాటేసిన అరుదైన పాము.. | Telangana: Woman Dies Of Snake Bite In Hanamkonda - Sakshi
Sakshi News home page

ఇంటి సామగ్రి కడుగుతుండగా.. మహిళను కాటేసిన అరుదైన పాము..

Aug 9 2023 1:06 AM | Updated on Aug 9 2023 12:53 PM

- - Sakshi

ఇంటి సామగ్రి కడుగుతుండగా పాము కాటు వేసింది. దీంతో ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతి

వరంగల్: ఇంటి సామగ్రి కడుగుతుండగా పాము కాటు వేసింది. దీంతో ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం నగరంలోని పలువేల్పులలో జరిగింది.

పలివేల్పులకు చెందిన సల్లా పద్మ(38) ఉదయం ఇంటి ఆవరణలో సామగ్రి (బోళ్లు) కడుగుతుండగా పాము కాటు వేసింది. వెంటనే ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement