● ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు వచ్చిన
దసరా ఆదాయం
● ‘మహాలక్ష్మి’ కింద 39.98 లక్షల మంది ప్రయాణం
హన్మకొండ: బతుకమ్మ, దసరా పండుగలకు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ రూ.33.63 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకుంది. పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఈ నెల 9 నుంచి 25వ తేదీ వరకు రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక సర్వీసులు నడిపింది. వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల ద్వారా 63.76 లక్షల కిలో మీటర్లు బస్సులు తిరిగి 61.07 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసింది. రూ.33,63,14,000 ఆదాయాన్ని సాధించింది. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా 39.98 లక్షల మంది ప్రయాణించారు.
ఆర్టీసీ బస్సులోనే సురక్షిత ప్రయాణం
ఆర్టీసీ బస్సులోనే సురక్షిత ప్రయాణం. ఈ నమ్మకంతో ప్రయాణం చేసిన వారికి సంస్థ కృతజ్ఞతలు తెలుపుతోంది. అధికారులు, కార్మికులు సమష్టి కృషి, సమన్వయంతో అహర్నిశలు శ్రమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత సమర్థవంతంగా నడిపించిన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మెకానిక్‌లు, ట్రాఫిక్ సూపర్ వైజర్లు, డిపో మేనేజర్లు, పాలనా సిబ్బందికి ధన్యవాదాలు.
– వరంగల్ ఆర్‌ఎం
ఎస్.భవానీ ప్రసాద్
డిపో వారీగా ఆదాయం (రూ.లక్షల్లో), బస్సులు తిరిగిన కి.మీ (లక్షల్లో) వివరాలు
డిపో ఆదాయం తిరిగిన ప్రయాణికులు మహిళలు
కి.మీ
హనుమకొండ 425.40 8.13 11,63,364 8,65,103
జనగామ 381.74 7.50 8,32,095 5,75,394
వరంగల్–1 500.47 10.41 5,90,479 3,30,395
వరంగల్–2 574.93 11.30 6,75,606 3,88,832
మహబూబాబాద్ 220.68 4.32 5,30,281 3,55,715
నర్సంపేట 274.37 5.10 6,06,194 3,95,784
పరకాల 250.19 4.49 6,28,529 4,15,240
తొర్రూరు 365.81 6.31 5,35,728 3,41,101
భూపాలపల్లి 369.56 6.22 5,45,709 3,30,502


