కనీస సదుపాయాలు కల్పించండి | - | Sakshi
Sakshi News home page

కనీస సదుపాయాలు కల్పించండి

Oct 27 2026 1:08 AM | Updated on Oct 27 2026 1:08 AM

కనీస సదుపాయాలు కల్పించండి

వరంగల్‌ అర్బన్‌: సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు నిర్మించాలని, తాగునీటి నల్లాలకు నీరందించి, వీధి లైట్లు వెలిగేలా చూడాలని పలు కాలనీల ప్రజ లు వినతులు అందించారు. సోమవారం బల్దియా కౌన్సిల్‌ హాల్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు మొత్తం 113 ఫిర్యాదులు అందాయి. అందులో మౌలిక వసతుల కల్పన కోసం ఇంజనీరింగ్‌ విభాగానికి 48 ఫిర్యాదులు అందాయి. ఆక్రమణలు, అనధికారిక కట్టడాలపై టౌన్‌ ప్లానింగ్‌కు, ప్రజారోగ్యానికి 15, రెవెన్యూ విభాగానికి 10, ఉద్యాన వన శాఖకు ఒక ఫిర్యాదు, ఇతర సమస్యలపై మిగతా ఫిర్యాదులు అందాయి. కమిషనర్‌ టి.వెంకన్న గ్రీవెన్స్‌ సెల్‌లో పౌరుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ జోనా, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ రాజ్‌కుమార్‌, సిటీప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మ య్య, సెక్రటరీ అనిల్‌బాబు, హార్టికల్చర్‌ అధికారి లక్ష్మారెడ్డి, పన్నుల అధికారి రామకృష్ణ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● గిర్మాజీపేట కూరగాయల మార్కెట్‌ సమీపంలోని హరిజన వాడలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని స్థానికులు కోరారు.

● 13వ డివిజన్‌ నజరాత్‌పురాలో సీసీ రోడ్డు నిర్మించాలని స్థానిక డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బోట్ల ప్రసాద్‌ వినతిపత్రం అందించారు.

● వరంగల్‌ 34వ డివిజన్‌ శివనగర్‌ పద్మశాలి కల్యాణ మండపం, హనుమకొండ భీమారంలో మిషన్‌ భగీరథ నీరు నల్లాలకు సరఫరా చేయాలని బి.శ్రీధర్‌, తాళ్ల శ్రీనివాస్‌ వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు.

● హనుమకొండ కోమటిపల్లి రోడ్డు నక్షత్ర కాలనీలో నిలిచిన డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు.

● హనుమకొండలోని దుర్గాదాస్‌ కాలనీలో మా హోమ్స్‌ కాలనీకి తాగునీటి కనెక్షన్స్‌ ఇవ్వాలని అపార్ట్‌మెంట్‌ వాసులు విన్నవించారు.

● 18వ డివిజన్‌ వంద ఫీట్ల రోడ్డులో ఉన్న పైప్‌లైన్లను తొలగించి ప్రమాదాల నుంచి వాహనదారులను కాపాడాలని పలు కాలనీలవాసులు విజ్ఞప్తి చేశారు.

గ్రేటర్‌ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన వినతులు

ఫిర్యాదులు స్వీకరించిన

బల్దియా కమిషనర్‌ వెంకన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement