మొగోడివైతే మీసాలు మెలేయాలి.. మెలేయడానికి నీకు మీసాలు లేవు.. | - | Sakshi
Sakshi News home page

మొగోడివైతే మీసాలు మెలేయాలి.. మెలేయడానికి నీకు మీసాలు లేవు..

Jun 19 2023 1:05 AM | Updated on Jun 19 2023 1:53 PM

- - Sakshi

రామన్నపేట : ‘కొమ్మాల లక్ష్మీనరసింహస్వామికి మీసాలు ఉంటాయి.. కొండా మురళీకి మీసాలు ఉంటాయి.. మొగోడివైతే మీసాలు మెలేయాలి.. మెలేయడానికి నీకు మీసాలు లేవు శ్రీ.. కేటీఆర్‌ ఖబర్దార్‌.. అంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. వరంగల్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా చేసిన వ్యాఖ్యాలపై ఆయన ఆదివారం స్పందించారు. పోచమ్మమైదాన్‌లోని రత్నహోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొండా దంపతులు పారిపోయిల్లు అంటున్నవ్‌.. వరంగల్‌లో బస్వరాజు సారయ్యను ఓడించాలంటే మీరైతేనే సాధ్యమని మీ అయ్య తూర్పు నియోజకవర్గానికి పంపించింది నిజం కాదా అని ప్రశ్నించారు.

కొండా మురళీ గుండా.. రౌడీ అంటున్నావు.. ఆ రోజు ఎమ్మెల్సీ పదవి ఏకగీవ్రంగా ఎన్నికై నప్పుడు గుర్తుకు లేదా అంటూ మండిపడ్డారు. మమ్ముల్ని మీరు పిలిచారా.. మేము నీ దగ్గరికి వచ్చా మా గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు. ‘నాకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టే తరాజు జోకేటోడు(మంత్రి దయాకర్‌రావు) పార్టీలోకి వస్తే మేము బయటికి వచ్చాం.

కంపెనీల పేరుతో ఏడేళ్ల కింద రైతుల నుంచి భూములు తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అప్పటి నుంచి చేయనిది.. ఐదు నె లలో పూర్తి చేస్తారా.. మాయమాటలతో ప్రజలను మోసం చే యవద్దంటూ’ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఐదు నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం త థ్యమని పేర్కొన్నారు.

ఆ తరువాత విజయమాల్యా మాది రిగి కేటీఆర్‌ విదేశాలకు పారిపోవడం ఖాయమని చెప్పారు. సిరిసిల్లలోనే నీ పరిస్థితి బాగా లేదు.. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నవా అంటూ ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖతో పాటు పరకాలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత నాదే అంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు మీసాల ప్రకాశ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement