గర్వించేలా గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

గర్వించేలా గుర్తింపు

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

గర్వించేలా గుర్తింపు శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 నెహ్రూనగర్‌: నగరంలో వాహన కాలుష్యాన్ని సమూలంగా కట్టడి చేసేందుకు జీఎంసీ విప్లవాత్మక అడుగులు వేసింది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ● 420 విద్యుత్‌ వాహనాలు: ఇంటింటి చెత్త సేకరణ కోసం 220 ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలు, 200 నాలుగు చక్రాల ఎలక్ట్రిక్‌ ఆటో టిప్పర్లను ఉపయోగిస్తున్నారు. వీటికి జీపీఎస్‌ అనుసంధానం చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తూ వందశాతం సేకరణ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ● ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌: సంగం జాగర్లమూడి నీటి రిజర్వాయర్‌లో 1,515 సోలార్‌ మాడ్యూళ్లతో ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా రోజుకు సుమారు 2,500 యూనిట్ల హరిత విద్యుత్‌ ఉత్పత్తవుతోంది. ఈ విద్యుత్‌తోనే చెత్త సేకరించే ఈ–వాహనాలను చార్జింగ్‌ చేస్తున్నారు. ప్రతి వార్డును సుమారు 350 గృహాలతో ‘మైక్రో పాకెట్లు’గా విభజించి, ప్రత్యేక రూట్‌ మ్యాప్‌ల ద్వారా తడి, పొడి, శానిటరీ, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తున్నారు. ● కంపోస్టింగ్‌ – రీసైక్లింగ్‌: తడి వ్యర్థాలను వార్డు స్థాయి క్లస్టర్‌ కంపోస్టింగ్‌ యూనిట్లలో ప్రాసెస్‌ చేసి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. కాగితం, ప్లాస్టిక్‌, గాజు, లోహాలను మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్‌ఎఫ్‌) ద్వారా వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపుతున్నారు. ● వ్యర్థాల నుంచి విద్యుత్‌: నాయుడుపేటలో వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే 20 కిలోవాట్ల ప్లాంట్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. ● బయో మైనింగ్‌ సత్ఫలితం: నగరంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సుమారు 4.80 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలను బయో మైనింగ్‌ ద్వారా శాసీ్త్రయంగా తొలగించి, దాదాపు 20 ఎకరాల విలువైన భూమిని తిరిగి వినియోగంలోకి తెచ్చారు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించేందుకు క్లాత్‌ బ్యాగ్‌ వెండింగ్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. గాంధీ పార్కుకు ఒక కిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు తెచ్చి ఇస్తే ఉచిత ప్రవేశం కల్పించే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అలాగే కిలో ప్లాస్టిక్‌కు బదులుగా కిలో జీఎంసీ ఆర్గానిక్‌ కంపోస్ట్‌ను ప్రోత్సాహకంగా అందిస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

దుమ్ము నియంత్రణ..

మరో 5 నగరాలకు మెంటార్‌

‘స్వచ్ఛ షెహర్‌ జోడీ’ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ మెంటార్‌ యూఎల్‌బీగా ఎంపికై ంది. రాష్ట్రంలోని ఆత్మకూరు (కే), నూజివీడు, పొదిలి, నందికొట్కూరు, బేతంచర్ల నగరాలకు ఘన వ్యర్థాల నిర్వహణ, కంపోస్టింగ్‌, ఎంఆర్‌ఎఫ్‌, సీ అండ్‌ డీ వేస్ట్‌ నిర్వహణ తదితర అంశాల్లో సాంకేతిక సహకారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ‘సూపర్‌ స్వచ్ఛ్‌ లీగ్‌ సిటీ’గా గుర్తింపు సాధించిన జీఎంసీ... ఇప్పుడు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లోనూ జాతీయ స్థాయి 2వ ర్యాంకుతో జాతీయ పటంలో సగర్వంగా నిలవడంతో నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వ్యర్థాల నిర్వహణలో సరికొత్త

విధానాల అమలు

‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌–2026’లో

జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌

ఫ్లోటింగ్‌ సౌర విద్యుత్‌తో

420 ఈ–వాహనాల పరుగులు

మైక్రో పాకెట్లు.. చెత్త నుంచి సంపద

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై సమరం

‘ఆత్మ’లకూ పింఛన్లు!

‘సర్‌’పై ఎన్నో సందేహాలు

నగరంలో గాలి నాణ్యతను కాపాడేందుకు ప్రధాన రహదారులపై మెకానికల్‌ స్వీపింగ్‌ యంత్రాలు, ధూళి నియంత్రణకు వాటర్‌ స్ప్రింక్లర్లు వినియోగిస్తున్నారు. రహదారులపై ఏర్పడే గుంతలను గుర్తించిన వెంటనే మరమ్మతులు చేసేందుకు ‘రోడ్‌ డాక్టర్‌’ వ్యవస్థ ద్వారా వేగంగా ప్యాచ్‌వర్క్‌ పనులు చేపడుతున్నారు. రహదారి డివైడర్లలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ అర్బన్‌ గ్రీనరీని విస్తరించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత ఆలోచనలు తోడైతే నగర రూపురేఖలు ఎలా మారతాయో గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) నిరూపిస్తోంది. శాసీ్త్రయ పద్ధతుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, హరిత ఇంధన వినియోగంతో సుస్థిర ప్రగతి దిశగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌–2026’లో దేశవ్యాప్తంగా 130 నగరాలతో పోటీపడి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును కై వసం చేసుకుంది. నగరపాలక సంస్థ పరిధిలోని 42వ వార్డు రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుని ఆదర్శంగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement