రాఖీ ట్రెండూ మారింది.. u సంప్రదాయాలు కలబోసేలా..
సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ ఉన్న వారు, సంప్రదాయ గురుతులు, మత విశ్వాసాల ప్రకారం ఎరుపు, పసుపు రంగుల దారాలు, ఓం, స్వస్తిక్‌లతో కూడిన రాఖీలను మార్కెట్‌లో ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. మరికొందరైతే రుద్రాక్షలు పొదిగిన రాఖీలపై కూడా చూస్తుండటంతో మార్కెట్‌లో వాటికి డిమాండ్ కనిపిస్తుంది.
u స్పిరిచువల్, డివోషనల్ రాఖీలు..
నేటి తరం యువత స్టైల్‌లో సంప్రదాయాన్ని మిక్స్ చేసేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. అందులో భాగంగా డివోషనల్ రాఖీలకు కూడా మాంచి డిమాండ్ ఉంది. రుద్రాక్షలు, ఓం, స్వస్తిక్, గణేశుడు, కృష్ణుడు బొమ్మలతో వచ్చే రాఖీలు గత కొంతకాలంగా ఎవర్‌గ్రీన్‌గా రిచ్‌గా నిలుస్తున్నాయి.
u మోటూ పత్లూ బొమ్మలతో..
ఇక రాఖీల్లో అత్యంత డిమాండ్ ఉన్న మరికొన్ని రాఖీలు చిన్నపిల్లలకు చెందినవి. అందులోనూ బోటూ పత్లూ, చోటాభీమ్, అవెంజర్స, స్పైడర్ మ్యాన్.. వంటి కార్టూన్, బొమ్మలతో ఉన్న రాఖీలకు మంచి గిరాకీ ఉంది.
u ప్రకృతి ప్రేమికుల కోసం..
కొందరు ప్రకృతి ప్రేమికులు రసాయనాలు లేని ఆర్గానిక్ కాటన్, జూట్, స్వచ్ఛమైన నల్లమట్టి, ఎర్ర మట్టితో రాఖీలను తయారు చేస్తున్నారు. మరికొందరైతే రాఖీల మధ్యలో మొక్కల విత్తనాలను ఉంచి సోదరులకు కడుతున్నారు.
u గిఫ్టింగ్ ఐడియాలూ క్రేజీనే..
రాఖీల సంగతి అటుంచితే రాఖీ కట్టిన అక్కలు, చెల్లెళ్లకు ఇచ్చే గిఫ్ట్‌లను కూడా క్రేజీగానే ప్లాన్ చేస్తున్నారు అన్నదమ్ములు. పెద్ద పెద్ద చాక్లెట్లు, స్వీట్లుపై చెల్లెళ్లు, అక్కల ఫోటోలు వచ్చేలా స్పెషల్ గిఫ్ట్ ర్యాపర్స్‌తో స్పెషల్ చాక్లెట్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.. అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు. ప్రత్తిపాడు: మారుతున్న కాలంతో పాటు రాఖీల ట్రెండ్, స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు రాఖీ అంటే.. వృత్తాకారంలో ఉండే స్పాంజ్.. రంగురంగుల తగరపు కాగితాలు, దారాలతో.. దానిపై ఒక చిన్న స్టిక్కర్. ఇవే రకరకాల సైజుల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు సరిపడేలా ఉండేవి. కానీ కాలం మారింది. కాలంతో పాటే నయా ట్రెండ్ కూడా వేగంగా దూసుకొస్తుంది. కాలానుగుణంగా సంప్రదాయ రాఖీల స్థానంలో ట్రెండీ ట్రెండీ రాఖీలు సరికొత్త హంగులు దిద్దుకుంటూ వచ్చేస్తున్నాయి. ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి నేపథ్యంలో సరికొత్త రాఖీ డిజైన్లు, యువతను ఆకర్షిస్తున్న హైటెక్ ట్రెండ్స్ ఆకట్టుకుంటున్నాయి.
కస్టమైజ్డ్ రాఖీల ట్రెండ్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వరకూ పాకింది. నిన్నమొన్నటి వరకు పట్టణాలు, నగరాల్లో ఉన్న ఈ పాశ్చాత్య సంస్కృతి ఇప్పుడు పల్లె తలుపు తడుతోంది. అన్నదమ్ముల ఫొటోలు, పేర్లు, లేదా చిన్ననాటి జ్ఞాపాలతో కూడిన హ్యాండ్‌మేడ్ ఫొటో రాఖీలను డిజైన్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి మోడల్స్ ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తుండగా కొందరు వాటిని ఆర్డర్ చేసుకుంటున్నారు. కాగా మరికొందరు స్థానికంగా ఉన్న గిఫ్ట్ షాపులు, ఫొటోస్టూడియోలు, డిజిటల్ ప్రెస్‌ల వద్దకు వెళ్లి వాళ్లకు నచ్చిన మోడల్ రాఖీలు సెలక్ట్ చేసుకుని అందుకనుగుణంగా ఫొటోలను రాఖీపై ముద్రించేలా ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. యువతీ, యువకుల ఆకాంక్షలకు అనుగుణంగానే ఆయా డిజిటల్, ఫొటో ప్లాట్‌ఫాంలు కూడా రాఖీకి ప్రత్యేక ఆఫర్లు పెడుతూ ఆకర్షిస్తున్నాయి.
ఇది వినడానికి కాస్తంత హంగామాగానే ఉన్నప్పటికీ ఇదో ట్రెండ్ అయింది. రాఖీలపై ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది. కోడ్‌ను మొబైల్‌లో స్కాన్ చేయగానే సోదరీమణులతో సోదరులు దిగిన ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, సందేశాలతో కూడిన దృశ్యాలు అరచేతిలో స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యేలా ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, యాప్‌లలో సరికొత్తగా డిజైన్లు రూపొందించుకుంటున్నారు.
లైఫ్‌స్టైల్ లుక్‌తో బ్రాస్‌లెట్, చైన్ రాఖీలు..
ఈ రాఖీలు ఎంతో స్టైలిష్‌గా ఉంటాయి. సంప్రదాయ రాఖీలకు పూర్తి భిన్నంగా స్ట్టైలిష్ మెటల్ లేదా వెండి బ్రాస్‌లెట్ మాదిరిలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం రాఖీ పౌర్ణమి నాడు కట్టించుకుని పక్కన పడేసే విధంగా కాకుండా మంచి నాణ్యతతో ఉంటుండటంతో తరువాత కూడా చేతికి బ్రేస్‌లెట్ మాదిరిగా ధరించేందుకు కూడా అనువుగా ఉండటంతో తమ సోదరులకు వీటిని కట్టేందుకు అక్క, చెల్లెమ్మలు ఆసక్తి కనబరుస్తున్నారు.
యూత్ స్టైల్ మారింది
● సంప్రదాయ రాఖీలకు స్వస్తి
● కాలానుగుణంగా అనూహ్య మార్పులు
● ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్‌లో
నయా మోడల్స్
● వీటిపైనే ఆసక్తి చూపుతున్న జెన్–జీ
● రాఖీ పౌర్ణమిని స్పెషల్ రాఖీతో
సెలబ్రేట్ చేసుకునేందుకు
యూత్ ఆసక్తి
● పల్లెలకూ విస్తరించిన సరికొత్త ట్రెండ్
ఫొటోలతో కస్టమైజ్డ్ రాఖీలు..
క్యూఆర్ కోడ్‌తో రాఖీలు..