నగరంపాలెం: యువత సంక్షేమం, డ్రగ్స్ నియంత్రణ కోసం గుంటూరు పోలీస్‌శాఖ నిరంతరం శ్రమిస్తుందని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ అన్నారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వద్దు బిడ్డా’ ప్రచార చిత్రం ప్రివ్యూ షో మంగళవారం నగరంపాలెంలోని మైత్రి సినిమా కాంప్లెక్స్‌లో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ ప్రారంభించారు. ఎంపీ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు చేపడుతున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత డ్రగ్స్ బారినపడకుండా కాపాడాలనేది ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు దిలీప్‌రాజాతో చర్చించామని చెప్పారు. దీంతో పోలీస్‌శాఖ నుంచి అతడికి సహకారం అందించినట్లు చెప్పారు. సీనియర్ నటుడు నరసింహరాజు, ఇతర తారగణంతో యాడ్ ఫిలిం అద్భుతంగా చిత్రీకరించారని అన్నారు. చిత్ర దర్శకుడు దిలీప్‌రాజా మాట్లాడుతూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ప్రచార చిత్రాన్ని చిత్రీకరించామని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు, అళహరి శ్రీనివాసరావు(ఎస్‌బీ), జనార్దన్‌రావు(తెనాలి), సీతారాం(గుంటూరు తూర్పు), పూర్ణచంద్రరావు(దక్షిణ), మురళీకృష్ణ(ఉత్తర), నగరంపాలెం పీఎస్ సీఐ రాజేష్ పాల్గొన్నారు.
‘డ్రగ్స్ వద్దు బిడ్డా’ ప్రివ్యూ షోను
ప్రారంభించిన ఎంపీ, జిల్లా ఎస్పీ


