వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి | YSRCP Women Leaders Tied Rakhi To YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి

Aug 26 2026 5:19 PM | Updated on Aug 26 2026 6:00 PM

YSRCP Women Leaders Tied Rakhi To YS Jagan

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన మహిళలు ఆయనకు స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా వైఎస్‌ జగన్‌ను కలిసి రాఖీ కట్టడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు వైఎస్‌ జగన్‌ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

వైఎస్ జగన్ కు రాఖీ కట్టిన మహిళలు

ఇదీ చదవండి: పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement