మండలి డెప్యూటీ చైర్మన్‌ మాధవరావుకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

మండలి డెప్యూటీ చైర్మన్‌ మాధవరావుకు సన్మానం

Aug 26 2026 1:54 AM | Updated on Aug 26 2026 1:54 AM

మండలి డెప్యూటీ చైర్మన్‌ మాధవరావుకు సన్మానం

పెదకూరపాడు: ప్రజా సమస్యలపై గళం వినిపించే నేతను మండలి డెప్యూటీ చైర్మన్‌గా నియమించడం అభినందనీయం అని మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. మంగళవారం గుంటూరులోని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వగృహంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి, మండలి డెప్యూటీ చైర్మన్‌ మాధవరావుని ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ శాసనమండలి సభ్యుడిగా వైఎస్సార్‌ సీపీ తరుపున ప్రజా సమస్యలపై తన గళం వినిపించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఘనంగా తీసుకెళ్లిన తుమాటి మాధవరావుని మండలి డెప్యూటీ చైర్మన్‌గా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రజా మన్ననలు పొంది మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెనాలి, వినుకొండ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్‌, బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ చీరాల, అద్దంకి, ఒంగోలు, పెనమలూరు, విజయవాడ తూర్పు, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్‌, చింతలపూడి అశోక్‌కుమార్‌, చుండూరి రవిబాబు, దేవభక్తుని చక్రవర్తి, దేవినేని అవినాష్‌, తన్నీరు నాగేశ్వరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement