అయ్యయ్యో.. తెనాలి పోలీష్‌.. | - | Sakshi
Sakshi News home page

అయ్యయ్యో.. తెనాలి పోలీష్‌..

Aug 27 2026 1:42 AM | Updated on Aug 27 2026 1:42 AM

● గతేడాది ఏప్రిల్‌ 5వ తేదీ పట్టణ బోస్‌ రోడ్డులో మద్యం తాగి యువకులు హల్‌చల్‌ చేస్తున్నారన్న సమాచారంతో వన్‌ టౌన్‌ ఎస్‌ఐ కె.విజయ్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ బ్రహ్మయ్య, కానిస్టేబుల్‌ కృష్ణమూర్తి, హోంగార్డు రాజు అక్కడకు చేరుకున్నారు. వారు ఎస్‌ఐపై దాడి చేసి రోడ్డుపైకి తోసివేసి వెళ్లారు. నిందితులకు నోటీసులు ఇచ్చి మిన్నకుండిపోయారు. ● అంతకు నెలరోజుల క్రితం తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌పోస్ట్‌ విధులు నిర్వహిస్తున్న త్రీ టౌన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ తోక తిరుమలరావు దాడి ఘటనలో గాయపడి, ఆసుపత్రిలో చేరిన యువకుడి వద్ద కేసు వివరాలు నమోదు చేస్తున్నారు. కూటమి నాయకుడు వెళ్లి, అదే ఘటనలో మరొకరి వివరాల నమోదుకు హెడ్‌కానిస్టేబుల్‌పై ఒత్తిడి చేశాడు. కుదరదని చెప్పడంతో హెడ్‌కానిస్టేబుల్‌ను అసభ్యంగా దూషించడమే కాకుండా దాడి చేశాడు. ఈ కేసు కూడా అతీగతీ లేదు.

పోలీసులపై దాడి చేసిన నిందితులు ఏడాదిలో మూడోసారి ఇలా.. గోప్యంగా ఉంచుతున్న అధికారులు కనీస చర్యలు తీసుకోని వైనం ప్రజలకు రక్షణ చర్యలు శూన్యం

తెనాలి: తెనాలిలో పోలీసులపై ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఇద్దరు వ్యక్తులను మంగళవారం రాత్రి వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకొచ్చాక కానిస్టేబుల్‌పై దాడి చేసి పరారయ్యారు. అప్పుడే స్టేషనుకు వస్తున్న ఎస్‌ఐ... ఓ నిందితుడిని పట్టుకున్నారు. బాధిత కానిస్టేబుల్‌ బి.శ్రీనివాస్‌ బుధవారం తెల్లవారుజామున చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మరో గంటకు దాడిపై ఎంఎల్‌సీ రాసి, సంబంధిత స్టేషన్‌కు సమాచారమిచ్చారు. ఇదేరోజు సాయంత్రం డిశ్చార్జ్‌ అయ్యారు. దీనిపై కేసు నమోదు గురించి గోప్యత పాటిస్తున్నారు.

గతంలోనూ ఇదే తరహాలో...

ఎప్పుడూ వివాదాలే...

అధికారుల తరపున పోలీస్‌స్టేషన్లలో కొందరు కానిస్టేబుళ్లు వసూళ్లు చేస్తుంటారనే ఆరోపణలు తెలిసిందే. అలాంటి కానిస్టేబుళ్లను ఎస్‌బీ అధికారులు పంపించమని అధికారులకు సూచించినా, ఏదో ఒక కారణం చెప్పి పంపించరు. ఇటీవల ఒక స్టేషను సీఐ తన పరిధిలోని కానిస్టేబుల్‌ను పంపించారు. ఎస్‌బీ అధికారులు గట్టిగా అడగ్గానే, ఆ వివరాలన్నీ ఆ కానిస్టేబుల్‌ రాసిచ్చాడంట! దీనితో అతడిని, మరో పోలీసును బదిలీ చేశారని సమాచారం. తెనాలిలో అవినీతి, అక్రమ కార్యకలాపాలు, మహిళలతో వ్యవహరిస్తున్న తీరుతోనే పోలీసులు చెడు పేరు తెచ్చుకున్నారు. గత నెలలో సస్పెండయిన టూటౌన్‌ సీఐ నుంచి ఏడాది కాలంలో పలువురు పోలీసులపై క్రమశిక్షణ వేటుపడింది. అవినీతి ఆరోపణలపై ఒక కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. తర్వాత ఓ కానిస్టేబుల్‌, మరో హెడ్‌ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. రూరల్‌ స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్‌ చేశారు. వివిధ ఆరోపణలపై ఇటీవల తెనాలి డీఎస్పీ, త్రీటౌన్‌, వన్‌టౌన్‌ సీఐ, రూరల్‌ ఎస్‌ఐకు షోకాజ్‌ నోటీసులిచ్చారు. అయినా పోలీసుల తీరు మారటం లేదు. గట్టిగా ప్రక్షాళన మినహా వేరే మార్గం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement