ఆర్టీసీ అధికారులపైన నోరు పారేసుకుంటున్న నేతలు కానిస్టేబుల్ ఠాగూర్‌పై దాడి సీసీ పుటేజీ బయటకు రావడంపై బూతు పురాణం గతంలోనూ అనేక వివాదాల్లో మాజీ కార్పొరేటర్ అశోక్ ప్రమేయం గూండాలు, గంజాయి బ్యాచ్‌తో బెదిరింపులకు దిగిన వైనం బస్టాండ్ ఘటనలో కూడా నిందితులను తప్పించే ప్రయత్నం
పోలీసుస్టేషన్ ‘పిల్లి’ హంగామా
పట్నంబజారు: ఆర్టీసీ బస్టాండ్‌లో మాజీ కార్పొరేటర్ యల్లావుల అశోక్ చేసిన విధ్వంసానికి కూటమి నేతలు కొమ్ము కాస్తున్నారు. బాధితులను కూడా భయపెడుతున్నారు. ఆఖరికి పోలీసుస్టేషన్‌కు కూడా ఉద్దేశపూర్వకంగా టీడీపీ గూండాలను వెంటబెట్టుకుని వచ్చి ఓవర్‌యాక్షన్ చేస్తున్నారు.
ఆర్టీసీ బస్టాండ్‌లో కానిస్టేబుల్ ఆమంచి ఠాగూర్‌పై మాజీ కార్పొరేటర్ యల్లావుల అశోక్, అతని అనుచరులు దాడి చే సిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకేత్తించిన విషయం విదితమే. ఈ ఘటనలో అశోక్‌తో పాటు మరో 20 మంది ఉన్నారని తొలుతగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, తిరిగి అశోక్‌తో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశామని స్వయంగా ఈస్ట్ సబ్‌డివిజన్ డీఎస్పీ తాండ్ర సీతారామ్ మీడియా సమావేశంలో చెప్పారు. ఆర్టీసీ కానిస్టేబుల్, అశోక్‌తో పాటు మరో 20 మంది ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అరెస్ట్ చేస్తామంటూపప
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యల్లావుల అశోక్ పాతగుంటూరు పోలీసుస్టేషన్‌కు ఆదివారం రాత్రి వచ్చారు. అదే స్టేషన్ ముందుకు ఒకటికి పలుమార్లు అశోక్, అతడితో పాటు కేసులో నిందితులుగా ఉన్న ప లువురు తిరుగుతున్నప్పటీకీ అరెస్ట్‌చేస్తామని వీరపలు కులు పలికిన పోలీసులు.. కళ్లప్పగించి చూస్తున్నారు.
సీసీ ఫుటేజీ బయటకు రాకుంటే...?
కానిస్టేబుల్ ఆమంచి ఠాగూర్‌పై జరిగిన ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ బయటకు రాకపోతే.. టీడీపీ నేతలు చెప్పినట్టే పోలీసుస్టేషన్‌లో జరిగేది. అశోక్ అతని అనుచరులు దాడి చేశారని వీడియోలు ఉంటేనే.. కేసు నమోదు చేసేందుకు 24గంటలు పైన సమయం తీసుకున్న పోలీసులు.. అసలు సీసీ పుటేజీ లేకుంటే వీడియో లేకుంటే కేసు నమోదు చేసే వారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆఖరికి కూటమి నేతల పక్షాన పాతగుంటూరు పోలీసుస్టేషన్ అధికారి ఆర్టీసీ అధికారులతో పుటేజీ బయటకు ఇవ్వటం సరికాదని వారిని భయపెట్టే విధంగా మాట్లాడారని సమాచారం.
తొలి నుంచి వివాదాస్పదుడే...
మాజీ కార్పొరేటర్ యల్లావుల అశోక్ తొలి నుంచి వివాదాస్పదుడేనని పాతగుంటూరు ప్రాంత ప్రజలు చెప్పుకుంటున్నారు. వివాదాలకు పాల్పడటం, మద్యం బ్యాచ్‌ను పెంచి పోషించటం వంటివి పరిపాటేనని అంటున్నారు. నిత్యం స్థానికంగా యువకులు మద్యం, గంజాయి మత్తులో ఘర్షణలకు వారికి అండగా పోలీసుస్టేషన్‌లో మాట్లాడి తీసుకుని రావటం వంటివి చేస్తారని చెబుతున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ నేతలు ఒక కార్యక్రమం అంశంలో ఫ్లెక్సీలు కార్పొరేషన్ అధికారుల అనుమతితో కట్టుకుంటే.. వాటిని నడిరోడ్డుపై చించివేసి.. రౌడీయిజం చేసిన చరిత్ర యల్లావుల అశోక్‌కు ఉంది. ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్‌కు సన్నిహితుడు కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు.
ఆదివారం రాత్రి యల్లావుల అశోక్‌తో పాటు స్టేషన్‌కు వచ్చిన టీడీపీ జిల్లా స్థాయి నేత, ప్రస్తుతం ఓ కార్పొరేషన్‌కు చైర్మన్ ఓవర్‌యాక్షన్ చేశారని పోలీసు సిబ్బంది చెప్పుకుంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఘటన జరిగిన తరువాత మీడియాకు సీసీ పుటేజీ అందిన దాకా పోలీసులు ఏం చేస్తున్నారంటూ... బూతుపురాణం ఎత్తుకున్నారని తెలుస్తోంది. పోలీసుస్టేషన్‌లో డ్రామాలు ఏంటని పోలీసు అధికారులు, సిబ్బంది నివ్వెరపోయే పరిస్థితి.


