ఆడ పిల్లలు పుట్టారని.. | - | Sakshi
Sakshi News home page

ఆడ పిల్లలు పుట్టారని..

Aug 25 2026 2:03 AM | Updated on Aug 25 2026 2:03 AM

ఆడ పిల్లలు పుట్టారని.. ఉద్యోగులపై వేధింపులు ●

2020లో పెళ్లైంది. భర్త పొక్లెయిన్‌ డ్రైవర్‌. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు. ఈ ఇద్దరు పిల్లల తరువాత మగ పిల్లాడు కావాలంటూ పలుమార్లు పుట్టింటిలో విడిచివెళ్లారు. ఆడ పిల్లలు పుట్టారనే నెపంతో వేధింపులకు గురిచేశాడు. భర్తపై 2022లో కోర్టులో కేసు వేశా. వాయిదాలు జరిగే క్రమంలో అత్తారింటికి తీసుకెళ్లేవాడని, మళ్లీ పుట్టింటిలోనే విడిచి వెళ్లేవాడు. ఇటీవల మూడోసారి గర్భం వచ్చింది. ప్రస్తుతం నాలుగో నెల. ఇటీవల స్కానింగ్‌ పరీక్షలు చేయించాడు. అప్పటి నుంచి మళ్లీ కొట్టడం మొదలుపెట్టాడు. కొద్దిరోజుల క్రితం మళ్లీ పుట్టింటిలో వదిలేసి వెళ్లాడు. నా పిల్లలకు న్యాయం చేయాలి.

– పి.దుర్గ, కేవీపీకాలనీ మూడో వీధి

వడ్డీల వ్యాపారి, అతని బినామీల వేధింపులు భరించలేకపోతున్నాం. కొరిటెపాడులో ఉంటున్న వడ్డీ వ్యాపారి వద్ద గతంలో అప్పుగా డబ్బులు తీసుకున్నాం. నెలనెలా చెల్లించి అప్పులు తీర్చాం. అయినప్పటికీ బాకీ ఉన్నారంటూ మమ్మల్ని ఇబ్బందు లకు గురిచేయడం మొదలెట్టాడు. మధ్యవర్తిపై కూడా వేధింపులకు గురిచేస్తున్నాడు. రూ.2 లక్షలు తీసుకుని చెల్లించిన అదనపు నగదు చెల్లించాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చెక్కులు, ప్రామిసరీ నోట్లు అడ్డుగా పెట్టుకుని కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్నాడు. అతడి బారి నుంచి కాపాడాలని కోరుతున్నాం.

– జి.శ్రీనివాసరావు(జీజీహెచ్‌),

అంజినాయక్‌ (ఆర్‌/బీ), షరీఫ్‌(టీచర్‌), ఽ

దనుంజయ్‌(ఇంటర్‌బోర్డు), ఎం.శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement