గుంటూరు వెస్ట్: గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కచ్చితంగా కాపాడాలని, త్వరలో వీటిపై ఆడిట్ కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌లో నోటీసులు అందజేసిన వారికి నిర్దేశిత గడువులో హియరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. హియరింగ్‌కు సంబంధించిన ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కార్యక్రమం నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించి, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లాలో కార్డులు లేని యానాది కుటుంబాలను గుర్తించి వారికి ఆధార్ కార్డులు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అందేలా అవసరమైన గుర్తింపు పత్రాలను సమకూర్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీబీజీ రామ్‌జీ తదితర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ చర్చించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ నాగసాయి కుమార్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ


