సత్తెనపల్లి: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం యువతిని బలిగొంది. పొన్నూరు సమీపంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన లలితశ్రీ (21) నలంద కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. రోడ్డుపై వెళుతుండగా రహదారి విస్తరణ పనులు నిమిత్తం వచ్చిన క్రేన్ డ్రైవర్ అజాగ్రత్త వలన ఆమెకు క్రేన్ తగిలి కింద పడిపోయింది. స్థానికులు గమనించి, డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసే సమయానికి పరిస్థితి విషమించి మృతి చెందింది.


